అంత ఒత్తిడిలో అలాంటి ఆటతీరు చాలా భేష్.. రహానేపై ప్రశంసలు!

ABN , First Publish Date - 2020-12-28T12:42:45+05:30 IST

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా - భారత్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచులో భారత జట్టు ప్రదర్శనను, ముఖ్యంగా కెప్టెన్ అజింక్య రహానే ఆటతీరును మాజీ క్రికెటర్లు చాలా మంది మెచ్చుకుంటున్నారు.

అంత ఒత్తిడిలో అలాంటి ఆటతీరు చాలా భేష్.. రహానేపై ప్రశంసలు!

మెల్‌బోర్న్: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా - భారత్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచులో భారత జట్టు ప్రదర్శనను, ముఖ్యంగా కెప్టెన్ అజింక్య రహానే ఆటతీరును మాజీ క్రికెటర్లు చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆసీస్ మాజీ ఆటగాడు టామ్ మూడీ కూడా రహానేపై ప్రశంసలు కురిపించాడు. ఈ మ్యాచులో రహానేపై ఉందే ఒత్తిడి అంతా ఇంతా కాదని, కానీ అతను మాత్రం చాలా ప్రశాంతంగా కనిపించాడని మూడీ కొనియాడాడు. ‘‘బ్యాటింగ్ చేయడానికి వచ్చిన రహానే చాలా కంపోజుడ్‌గా కనిపించాడు. ఎక్కడా కంట్రోల్ తప్పినట్లు లేదు’’ అని మూడీ అన్నారు. ‘‘కోహ్లీ లేకపోవడం.. అడిలైడ్‌ టెస్టులో తాను ఘోరంగా విఫలం అవడం.. ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే రహానేపై ఏ రేంజ్‌లో ఒత్తిడి ఉందో అర్థం అయిపోతుంది’’ అని పేర్కొన్నాడు.

Updated Date - 2020-12-28T12:42:45+05:30 IST