రహానే.. కోహ్లీలా కాదు.. మాజీ ఆటగాడి కామెంట్స్!

ABN , First Publish Date - 2020-12-26T12:07:21+05:30 IST

ఆసీస్ టూర్‌లో ఉన్న భారత జట్టుకు రెండో టెస్టు నుంచి సారధ్యం వహిస్తున్న అజింక్య రహానేపై మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించాడు.

రహానే.. కోహ్లీలా కాదు.. మాజీ ఆటగాడి కామెంట్స్!

న్యూఢిల్లీ: ఆసీస్ టూర్‌లో ఉన్న భారత జట్టుకు రెండో టెస్టు నుంచి సారధ్యం వహిస్తున్న అజింక్య రహానేపై మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించాడు. విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ప్రస్తుతం గర్భవతి. ఆమె జనవరిలో బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ సమయంలో భార్యతో పాటు ఉండటం కోసం విరాట్.. తొలి టెస్టు అనంతరం స్వదేశానికి వచ్చేశాడు. దీంతో ఈ సిరీస్‌లో భాగంగా జరగబోయే మిగతా మూడు టెస్టులకు అజింక్య రహానే సారధ్యం వహించనున్నాడు. ఈ క్రమంలో కృష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ.. రహానే సారధ్యం జట్టు అదృష్టాన్ని మార్చే అవకాశం ఉందని అన్నాడు. ‘‘ఓ వ్యక్తిగా.. జట్టుపై రహానే ప్రభావం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అతను కోహ్లీలా అగ్రెసివ్‌గా తన భావాలను చూపించడు’’ అని క్రిస్ శ్రీకాంత్ పేర్కొన్నాడు.

Updated Date - 2020-12-26T12:07:21+05:30 IST