కరోనాపై పోరుకు విరాళం ప్రకటించిన ఛతేశ్వర్ పుజారా

ABN , First Publish Date - 2020-04-08T00:31:09+05:30 IST

కరోనా వైరస్(కోవిడ్-19) మహమ్మారిపై కేంద్ర చేస్తున్న పోరుకు టీం ఇండియా టెస్ట్ బ్యాట్స్‌మెన్ ఛతేశ్వర్ పుజారా తన వొంతు సహాయాన్ని అందించాడు.

కరోనాపై పోరుకు విరాళం ప్రకటించిన ఛతేశ్వర్ పుజారా

అహ్మదాబాద్: కరోనా వైరస్(కోవిడ్-19) మహమ్మారిపై కేంద్రం చేస్తున్న పోరుకు టీం ఇండియా టెస్ట్ బ్యాట్స్‌మెన్ ఛతేశ్వర్ పుజారా తన వొంతు సహాయాన్ని అందించాడు. ఈ మహమ్మారిపై జరుగుతున్న పోరు దేశ ప్రజలు అందరు అండగా నిలవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు పీఎం-కేర్స్ పేరుతో విరాళాలు సేకరించడం కూడా ప్రారంభించారు. ఇప్పటికే టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్ గంగూలీ, ధోనీ, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తదితరులు తమకు తోచిన మొత్తాన్ని పీఎం-కేర్స్‌కు విరాళంగా అందించారు. తాజాగా పుజారా వీరి సరసన చేరాడు. 


పీఎం-కేర్స్ ఫండ్‌తో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి సహాయనిధి కూడా తాను విరాళం అందిస్తున్నట్లు పుజారా ప్రకటించాడు. అయితే ఎంత మొత్తాన్ని తాను విరాళంగా అందిస్తున్నాడనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ‘‘నేను, నా కుటుంబం పీఎం-కేర్స్ ఫండ్, గుజరాత్ ముఖ్యమంత్రి సహాయనిధికి మాకు తోచిన చిన్న మొత్తాన్ని విరాళంగా అందించాము. మీరు కూడా మీకు తోచిన సహాయం చేయండి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో తమ ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వైద్యులు, పోలీసులకు నా కృతజ్ఞతలు’’ అని పుజారా ట్వీట్ చేశాడు. 

Updated Date - 2020-04-08T00:31:09+05:30 IST