‘అర్జున’కు ప్రణయ్‌

ABN , First Publish Date - 2020-06-22T09:07:44+05:30 IST

ఈ ఏడాది అర్జున అవార్డు ప్రతిపాదనకు ఎంపిక చేసిన వారి జాబితాలో సీనియర్‌ షట్లర్‌ హెచ్‌ఎ్‌స ప్రణయ్‌ పేరును భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) పక్కనబెట్టింది. అయితే, అతని పేరును చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ ఆదివారం

‘అర్జున’కు ప్రణయ్‌

న్యూఢిల్లీ: ఈ ఏడాది అర్జున అవార్డు ప్రతిపాదనకు ఎంపిక చేసిన వారి జాబితాలో సీనియర్‌ షట్లర్‌ హెచ్‌ఎ్‌స ప్రణయ్‌ పేరును భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) పక్కనబెట్టింది. అయితే, అతని పేరును చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ ఆదివారం సిఫారసు చేయడం విశేషం. క్రమశిక్షణ ఉల్లంఘన కారణాలతో వరుసగా రెండో ఏడాది కూడా ప్రణయ్‌ను పక్కనబెట్టిన బాయ్‌.. యువ ఆటగాళ్లు సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ షెట్టి, సమీర్‌ వర్మల పేర్లను అర్జునకు నామినేట్‌ చేసింది. దీంతో బాయ్‌పై ప్రణయ్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ‘మళ్లీ అదే పాత కథ.. ప్రతిభ గల ఆటగాడికి మరోసారి అన్యాయం జరిగింది’ అంటూ వరుసగా ట్వీట్లు చేశాడు. కాగా.. ఈనెల 3న ప్రణయ్‌ పేరును అర్జునకు గోపీ నామినేట్‌ చేశాడు. అయితే, తాను చీఫ్‌ కోచ్‌గా కాకుండా రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డు గ్రహీత హోదాలో ప్రణయ్‌ పేరును క్రీడాశాఖకు పంపాడు. మరోవైపు, క్రమశిక్షణ ఉల్లంఘన విషయం గోపీకి తెలియదని బాయ్‌ వర్గాలు తెలిపాయి. అయితే, దీనిపై వ్యాఖ్యానించడానికి గోపీ విముఖత వ్యక్తం చేశాడు.

Updated Date - 2020-06-22T09:07:44+05:30 IST