విశాఖ ఘటనపై క్రీడాకారుల దిగ్ర్భాంతి

ABN , First Publish Date - 2020-05-08T09:48:25+05:30 IST

విశాఖలో జరిగిన విష వాయువు లీక్‌ దుర్ఘటనపై క్రీడాలోకం దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. మరణించిన వారికి క్రీడాకారులు సంతాపం

విశాఖ ఘటనపై క్రీడాకారుల దిగ్ర్భాంతి

న్యూఢిల్లీ: విశాఖలో జరిగిన విష వాయువు లీక్‌ దుర్ఘటనపై క్రీడాలోకం దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. మరణించిన వారికి క్రీడాకారులు సంతాపం వ్యక్తం చేశారు. అస్వస్థులైన వారు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. విష వాయువు కారణంగా అనారోగ్యానికి గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. - విరాట్‌ కోహ్లీ

హృదయ విదారక దృశ్యాలను చూసి గుండె తరుక్కుపోయింది. నా ఆలోచనలు, ప్రార్థనలు విశాఖ ప్రజలతో ఉంటాయి. - పీవీ సింధు

గ్యాస్‌ దుర్ఘటన బాధిత కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నా.  - సైనా నెహ్వాల్‌

ఇదో దురదృష్టకర సంఘటన. అస్వస్థతకు గురైన వారు, వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి. వారి కోసం ప్రార్థిస్తున్నా. వైజాగ్‌ బలంగా ఉండాలి. - సానియా మీర్జా

Updated Date - 2020-05-08T09:48:25+05:30 IST