అదే జరిగితే ఆటగాళ్లు ఆ అదృష్టాన్ని కోల్పోతారు: ధవన్
ABN , First Publish Date - 2020-05-25T00:40:13+05:30 IST
టోర్నమెంట్లు కనుక కొంతకాలం పాటు ‘క్లోజ్‌డ్ డోర్స్’ వెనక జరిగితే ప్రేక్షకుల కేరింతల మధ్య ఆడే అదృష్టానికి

న్యూఢిల్లీ: టోర్నమెంట్లు కనుక కొంతకాలం పాటు ‘క్లోజ్‌డ్ డోర్స్’ వెనక జరిగితే ప్రేక్షకుల కేరింతల మధ్య ఆడే అదృష్టానికి క్రికెటర్లు దూరమవుతారని టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్ అభిప్రాయపడ్డాడు. శ్రీలంక మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్‌తో జరిగిన లైవ్ చాట్‌లో మాట్లాడుతూ ధవన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రేక్షకులు లేకుండా మైదానంలో ఆడడంపై నీ అభిప్రాయం ఏమిటన్న మాథ్యూస్ ప్రశ్నకు ధవన్ ఇలా సమాధానం ఇచ్చాడు. అదే జరిగితే.. పెద్ద సంఖ్యలో హాజరైన ప్రేక్షకుల ముందు ఆడడాన్ని కోల్పోతామని ధవన్ పేర్కొన్నాడు. అభిమానులు ఆటకు ప్రత్యేక ఆకర్షణ, ఒకరకమైన సౌరభాన్ని తీసుకొస్తారని అన్నాడు. కాగా, కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలుగా ఇంటి వద్ద ఉండడం ఒక అవకాశంగా భావిస్తున్నట్టు ధవన్ పేర్కొన్నాడు.