స్పెయిన్‌లో టీటీ ప్లేయర్ అవస్థలు
ABN , First Publish Date - 2020-05-19T09:10:52+05:30 IST
తన ఆటకు మెరుగులు దిద్దుకోవడానికి బెంగాల్‌కు చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి టేక్మి సర్కార్ స్పెయిన్‌కు వెళ్లింది. కానీ, కరోనా విజృంభించడంతో అక్కడే ...

న్యూఢిల్లీ: తన ఆటకు మెరుగులు దిద్దుకోవడానికి బెంగాల్‌కు చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి టేక్మి సర్కార్ స్పెయిన్‌కు వెళ్లింది. కానీ, కరోనా విజృంభించడంతో అక్కడే చిక్కుకు పోయింది. విమానాలు కూడా రద్దు కావడంతో తిరుగు ప్రయాణం సాధ్యపడలేదు. ఇంతలో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మార్చి 23న ఆమె తమ్ముడు రోడ్డు ప్రమాదంలో మర ణించాడు. అయితే, సోదరుడి కడసారి చూపునకు కూడా టేక్మి దూరమైంది. ఇది ఆమెను ఎంతగానో కలచి వేసింది. చేతిలో డబ్బులు లేకపోవడంతో ఎంతో ఇబ్బందులు పడుతోంది. పైగా వీసా గడువుకూడా ఈనెల 10తో ముగిసింది. అమ్మానాన్నకు అండగా ఉండాల్సిన ఈ కష్టకాలంలో ఎక్కడో స్పెయిన్‌లో చిక్కుకు పోయి నరకయాతన అనుభవిస్తున్నానని చెప్పింది. విమాన సర్వీసులు మొదలైన వెంటనే తల్లిదండ్రులను కలుసుకోవాలని సర్కార్ ఎదురు చూస్తోంది.