అహ్మదాబాద్‌లో పింక్ బాల్ టెస్ట్
ABN , First Publish Date - 2020-10-21T08:45:40+05:30 IST
అహ్మదాబాద్‌లో పింక్ బాల్ టెస్ట్

కోల్‌కతా: వచ్చే ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ టూర్లో భాగంగా అహ్మదాబాద్‌లో డే/నైట్ టెస్ట్‌ను నిర్వహించనున్నట్టు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పాడు. జనవరి నుంచి మార్చి వరకు జరిగే ఈ పర్యటనలో ఐదు టెస్ట్‌లు, పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లో టీమిండియాతో ఇంగ్లండ్ తలపడనుంది. అహ్మదాబాద్‌లో పింక్ బాల్ టెస్ట్ జరుగుతుందని మంగళవారమిక్కడ జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో గంగూలీ తెలిపాడు. అయితే, ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో కొద్ది రోజుల్లో టీమ్ సెలెక్షన్ ఉంటుందని సౌరవ్ చెప్పాడు. త్వరలో జరగనున్న సర్వసభ్య సమావేశంలో రంజీ ట్రోఫీపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపాడు.