‘క్రికెట్ అభిమానులే కాదు.. అందరి కళ్లూ ఈ సిరీస్‌పైనే’

ABN , First Publish Date - 2020-06-24T03:53:19+05:30 IST

కరోనా భయంతో అటకెక్కిన క్రికెట్ ఆట.. ఇంగ్లండ్-వెస్టిండీస్ సిరీస్‌‌తో మళ్లీ ప్రారంభం కానుంది.

‘క్రికెట్ అభిమానులే కాదు.. అందరి కళ్లూ ఈ సిరీస్‌పైనే’

లండన్: కరోనా భయంతో అటకెక్కిన క్రికెట్ ఆట.. ఇంగ్లండ్-వెస్టిండీస్ సిరీస్‌‌తో మళ్లీ ప్రారంభం కానుంది. ఈ కారణంగా క్రికెట్ ప్రపంచం మొత్తం ఈ సరీస్‌పై దృష్టి పెడుతుందని ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అభిప్రాయపడ్డాడు. కేవలం క్రికెట్ అభిమానులే కాకుండా, ఇతరులు కూడా ఈ సిరీస్‌ చూసే అవకాశం ఉందని అతను చెప్పాడు. ‘కేవలం క్రికెట్ అభిమానులే కాదు, అందరి కళ్లూ ఈ సిరీస్‌పైనే ఉంటాయి. మామూలుగా క్రికెట్ చూడని వాళ్లు కూడా ఈ మ్యాచులు చూస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఆడే లైవ్ ఆట కదా’ అని జోఫ్రా పేర్కొన్నాడు. ఇంగ్లండ్-వెస్టిండీస్ మధ్య మూడు టెస్టుల సిరీస్ జరగనుంది. దీన్ని ఖాళీ స్టేడియాల్లో నిర్వహించనున్నారు.

Read more