టీచర్లకు సెల్యూట్‌

ABN , First Publish Date - 2020-06-26T08:33:45+05:30 IST

లాక్‌డౌన్‌ సమయంలోనూ.. పిల్లలు చదువులో వెనుకబడకూడదనే ఉద్దేశంతో టీచర్లు ఎంతో శ్రమిస్తున్నారని ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు ...

టీచర్లకు సెల్యూట్‌

లాక్‌డౌన్‌లోనూ ఎంతో శ్రమిస్తున్నారు

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ సమయంలోనూ.. పిల్లలు చదువులో వెనుకబడకూడదనే ఉద్దేశంతో టీచర్లు ఎంతో శ్రమిస్తున్నారని ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు కొనియాడింది. ఆన్‌లైన్‌ తరగతులతో విద్యనందిస్తున్నారని చెప్పింది. వారి కృషిని ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరింది. ‘ఓ బంధువుల అబ్బాయితో మాట్లాడా. లాక్‌డౌన్‌లో ఎలా చదువుతున్నావని అడి గా. అయితే, ఆన్‌లైన్‌ క్లాసులతో అప్‌ టూ డేట్‌గా ఉన్నట్టు చెప్పాడు. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ క్లాసులు కూడా జరుగుతున్నట్టు తెలిపాడు. టీచర్లు ఎంతో వేగంగా పరిస్థితులకు అలవాటు పడడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. స్కూలు, కాలేజీ టీచర్లకు ధన్యవాదాలు. నా అధ్యాపకులు కూడా నాకు స్ఫూర్తిగా నిలిచారు. దేశంలో టీచర్లు ఎంతో కష్టపడుతున్నారు. వారికి మనం సెల్యూట్‌ చేయాల’ని ట్విటర్‌లో పోస్టు చేసిన ఓ వీడియోలో సింధు కోరింది. 

Updated Date - 2020-06-26T08:33:45+05:30 IST