పాక్ వన్డే కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు షాక్!
ABN , First Publish Date - 2020-02-08T03:15:15+05:30 IST
పాక్ వన్డే కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు మరో షాక్ తగిలింది. టెస్టు, టీ20ల్లో కెప్టెన్సీ కోల్పోయిన ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌కు

ఇస్లామాబాద్: పాక్ వన్డే కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు మరో షాక్ తగిలింది. టెస్టు, టీ20ల్లో కెప్టెన్సీ కోల్పోయిన ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌కు పాక్ క్రికెట్ బోర్డు మరో షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. వన్డే జట్టు పగ్గాలను టాప్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజంకు ఇవ్వనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సర్ఫరాజ్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించిన పీసీబీ టెస్టు కెప్టెన్సీని అజర్ అలీకి, టీ20కి బాబర్ ఆజంను కెప్టెన్లుగా నియమించింది. ప్రస్తుతం వన్డే జట్టు కెప్టెన్‌గా మాత్రమే మిగిలిపోయిన సర్ఫరాజ్‌కు అది కూడా దూరం కానుంది. బంగ్లాదేశ్‌తో ఏప్రిల్ 3న జరగనున్న ఏకైక వన్డే సారథ్య బాధ్యతలను బాబర్‌కు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, పీసీబీ మాత్రం ఇప్పటి వరకు ఎవరి పేరును ప్రకటించలేదు.
అయితే, సర్ఫరాజ్‌ను తప్పించడం సరికాదని విశ్లేషకులు అంటున్నారు. గతేడాది ఆరు వరుస విజయాలు అందించాడని చెబుతున్నారు. కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా సర్ఫరాజ్ జట్టుకు సేవలు అందిస్తున్నాడని, 32 సగటుతో బ్యాటింగులోనూ రాణించాడని గుర్తు చేస్తున్నారు. సర్ఫరాజ్ సాధించిన గొప్ప విజయం చాంపియన్స్ ట్రోఫీ. 2017 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్‌పై గెలిచి పాక్‌కు ట్రోఫీ అందించిపెట్టాడు.