కరోనాతో ఆసుపత్రిలో చేరిన బాక్సింగ్ దిగ్గజం

ABN , First Publish Date - 2020-06-26T22:45:40+05:30 IST

పనామా బాక్సింగ్ దిగ్గజం, ఆరుసార్లు ప్రపంచ విజేత అయిన రాబెర్టో డురాన్ (69) కరోనాతో ఆసుపత్రిలో చేరాడు.

కరోనాతో ఆసుపత్రిలో చేరిన బాక్సింగ్ దిగ్గజం

న్యూఢిల్లీ: పనామా బాక్సింగ్ దిగ్గజం, ఆరుసార్లు ప్రపంచ విజేత అయిన రాబెర్టో డురాన్ (69) కరోనాతో ఆసుపత్రిలో చేరాడు. ఈ విషయాన్ని ఆయన కుమారులు వెల్లడించారు. దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదైన రోజే ఆయన ఆసుపత్రిలో చేరడం గమనార్హం. ‘‘మా నాన్న పరీక్ష ఫలితాలు ఇప్పుడే వచ్చాయి. కోవిడ్-19 సోకినట్టు నిర్ధారణ అయింది’’ అని డురాన్ కుమారుడు రాబిన్ డురాన్ తెలిపాడు. ఆయనలో జలుబు తప్ప మరెటువంటి లక్షణాలు లేవని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆయన అబ్జర్వేషన్‌లో మాత్రమే ఉన్నారని, ఐసీయూలో లేరని వివరించాడు.    

Updated Date - 2020-06-26T22:45:40+05:30 IST