జూలైలో ఇంగ్లండ్ పర్యటనకు పాకిస్థాన్ జట్టు

ABN , First Publish Date - 2020-05-17T15:25:16+05:30 IST

ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డుతో జరిగిన సుదీర్ఘ సమావేశం అనంతరం తమ సీనియర్ క్రికెట్ జట్టు ఆటగాళ్లను ఇంగ్లండ్ పర్యటనకు పంపేందుకు పాకిస్థాన్ క్రికెట్

జూలైలో ఇంగ్లండ్ పర్యటనకు పాకిస్థాన్ జట్టు

న్యూఢిల్లీ: ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డుతో జరిగిన సుదీర్ఘ సమావేశం అనంతరం తమ సీనియర్ క్రికెట్ జట్టు ఆటగాళ్లను ఇంగ్లండ్ పర్యటనకు పంపేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఒప్పుకుంది. ఈ విషయాన్ని పీసీబీ సీఈవో వసీం ఖాన్ వెల్లడించారు. ఆటగాళ్ల భద్రత కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చిందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. 


జూలై నెల చివరి వారంలో 25 మంది సీనియర్ ఆటగాళ్లు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తారని.. అక్కడ ఆతిథ్య జట్టుతో మూడు టెస్టులు, మూడు టీ-20లు ఆడనున్నట్లు తెలిపారు. ఇక మ్యాచ్‌లు మాంచస్టర్, సౌతాంప్టన్ వేదికగా జరుగుతాయని చెప్పిన ఆయన.. బర్మింగ్‌హామ్ కేవలం ప్రాక్టీస్‌కి మాత్రమే వేదిక అవుతుందని తెలిపారు. మాంచస్టర్, సౌతాంప్టన్ స్టేడియంల సమీపంలో ఉన్న హోటళ్లలోనే ఆటగాళ్లు బస చేస్తారని.. తద్వారా ఆటగాళ్లు ఎక్కువ దూరం ప్రయాణించే పరిస్థితి కూడా ఉండదని ఆయన స్పష్టం చేశారు. 

Updated Date - 2020-05-17T15:25:16+05:30 IST