క్రికెటర్‌కు పాజిటివ్‌ లక్షణాలు

ABN , First Publish Date - 2020-03-18T09:51:31+05:30 IST

సెమీస్‌, ఫైనల్‌ మ్యాచ్‌లకు ముందు పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎ్‌సఎల్‌) వాయిదా పడింది. ఓ విదేశీ ఆటగాడికి కరోనా పాజిటివ్‌ లక్షణాలు కనిపించడంతో ఈ నిర్ణయం

క్రికెటర్‌కు పాజిటివ్‌ లక్షణాలు

పీఎస్‌ఎల్‌ వాయిదా

లాహోర్‌: సెమీస్‌, ఫైనల్‌ మ్యాచ్‌లకు ముందు పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎ్‌సఎల్‌) వాయిదా పడింది. ఓ విదేశీ ఆటగాడికి కరోనా పాజిటివ్‌ లక్షణాలు కనిపించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే అధికారికంగా నిర్వాహకులు అతడి పేరును వెల్లడించకపోయినా ఇంగ్లండ్‌ ఆటగాడు అలెక్స్‌ హేల్స్‌ కావచ్చని వ్యాఖ్యాత రమీజ్‌ రాజా తెలిపాడు. అటు హేల్స్‌ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. తను శనివారమే పాక్‌ను వీడి స్వదేశానికి వెళ్లాడు. అక్కడికి వెళ్లాక జ్వరంతో పాటు దగ్గు కూడా రావడంతో స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్టు ప్రకటించాడు. అయితే ఇంకా పరీక్షలు చేయించుకోలేదని, రిపోర్ట్‌ వచ్చాకే స్పష్టత వస్తుందని తెలిపాడు.  

Updated Date - 2020-03-18T09:51:31+05:30 IST