క్రికెట్‌కు ధోనీ గొప్ప సేవకుడు: మిస్బాఉల్‌ హక్

ABN , First Publish Date - 2020-08-17T02:37:25+05:30 IST

అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ శనివారం రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు ...

క్రికెట్‌కు ధోనీ గొప్ప సేవకుడు: మిస్బాఉల్‌ హక్

ఇస్లామాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ శనివారం రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు దేశాల క్రికెటర్లు దీనిపై స్పందిస్తున్నారు. పాకీస్తాన్ హెడ్ కోచ్ మిస్బా ఉల్ హక్ మాట్లాడుతూ, ధోనీ భారత క్రికెట్‌కు ఎనలేని సేవచేశాడని కీర్తించాడు. ‘నా దృష్టిలో ధోనీ కూడా ఓ లెజెండ్. అతడి కెప్టెన్సీలో భారత జట్టు గొప్ప స్థాయికి చేరుకుంది. భారత క్రికెట్‌ను మరో మెట్టు ఎక్కించానడంలో అతిశయోక్తి లేద’ని మిస్బా పేర్కొన్నాడు. అంతేకాకుండా ప్రపంచ క్రికెట్‌లోని అన్ని ట్రోఫీలను సాధించిన ఏకైక కెప్టెన్‌గా ధోనీ ఘనత సాధించాడని ప్రశంశించాడు. 

Updated Date - 2020-08-17T02:37:25+05:30 IST