క్రికెటర్‌గా ఓకే కానీ.. వ్యక్తిగతంగా మాత్రం.. గంభీర్‌పై మళ్లీ నోరు పారేసుకున్న అఫ్రిదీ

ABN , First Publish Date - 2020-07-19T22:19:31+05:30 IST

పాకీస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదీ మరోసారి గంభీర్‌పై నోరు పారేసుకున్నాడు. ఓ బ్యాట్స్‌మన్‌గా ...

క్రికెటర్‌గా ఓకే కానీ.. వ్యక్తిగతంగా మాత్రం.. గంభీర్‌పై మళ్లీ నోరు పారేసుకున్న అఫ్రిదీ

ఇస్లామాబాద్: పాకీస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదీ మరోసారి గంభీర్‌పై నోరు పారేసుకున్నాడు. ఓ బ్యాట్స్‌మన్‌గా గంభీర్‌ను తాను ఇష్టపడతానని, కానీ అతడి వ్యక్తిత్వం మాత్రం తనకు నచ్చదని అఫ్రిదీ చెప్పాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అఫ్రిదీ భారత మాజీ ఓపెనర్ గంభీర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘క్రికెట్ పరంగా నేను గంభీర్ అటతీరును ఎంతగానో ఇష్టపడతాను. కానీ వ్యక్తిగతంగా మాత్రం అతడు ఏదో మానసిక సమస్యలతో బాధపడుతున్నాడనేది నా అభిప్రాయం. ప్రపంచంలో ఎంతో మానసిక స్థైర్యం ఉన్న జట్టు ఇండియా. కానీ వారిలో గంభీరే అందరికన్నా మానసికంగా బలహీనుడం’టూ అఫ్రిదీ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. దీనికి ఉదాహరణగా అప్పట్లో భారత జట్టు మెంటార్‌గా పనిచేసిన ప్యాడీ అప్టాన్ వ్యాఖ్యలను గుర్తుచేశాడు. ‘అప్టాన్ భారత జట్టుతో కలిసి 2009 నుంచి 2011 వరకు పనిచేశారు. అతడు తన పుస్తకంలో కూడా గంభీర్‌ గురించి అనేక ఆసక్తికర విషయాలను వివరించారు. సెంచరీ కొట్టినా గంభీర్ సంతృప్తి చెందేవాడు కాదని, ఎప్పుడూ ఏదో విషయంలో మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉండేవాడని అతడు రాసుకొచ్చారు.  దానిపై గంభీర్‌తో ఎన్నో సార్లు మాట్లాడినా ఫలితం లేకపోయిందని తన పుస్తకంలో ప్యాడీ పేర్కొన్నాడు. దీని ద్వారా గంభీర్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు’ అంటూ అఫ్రిదీ వ్యాఖ్యానించాడు.


ఇదిలా ఉంటే ప్యాడీ పుస్తకంలో తన గురించి ఉన్న విషయాలపై గంభీర్ కూడా అప్పట్లో స్పందించాడు. ‘జట్టును ఎప్పుడూ మొదటి స్థానంలో ఉంచాలనేదే నా కోరిక. అందుకనే సెంచరీ చేసినంత మాత్రాన సంతృప్తి చేందను. జట్టును ఉన్నత శిఖరాలకు చేర్చాలనే నా ఆశయంలో నా సెంచరీ విలువెంత..? అందుకే ఇంకా ఏదో సాధించాలనే తపనతో ఉండేవాడిని. అలా ఉండడాన్ని నేనెప్పుడూ తప్పుగా అనుకోను. అయితే విలువైన ఆటగాడిగా జట్టు బాధ్యతను నా భుజాలపైనే ఎక్కువగా మోయాలనుకునేవాడినం’టూ గంభీర్ సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా ట్విటర్ వేదికగా షాహిద్ అఫ్రిదీకి కూడా గంభీర్ అనేకసార్లు చురకలంటించాడు.

Updated Date - 2020-07-19T22:19:31+05:30 IST