కరోనా నుంచి కోలుకున్న పాకిస్థాన్ క్రికెటర్

ABN , First Publish Date - 2020-06-06T23:23:12+05:30 IST

పాకిస్థాన్ క్రికెటర్ తౌఫీక్ ఉమర్ కరోనా వైరస్ నుంచి కోలుకున్నాడు. రెండు వారాల పాటు హోం క్వారంటైన్‌లో ఉన్న అతను ఇప్పుడు ఆరోగ్యకరంగా ఉన్ననని ప్రకటించాడు. ఇప్పటికే

కరోనా నుంచి కోలుకున్న పాకిస్థాన్ క్రికెటర్

పాకిస్థాన్ క్రికెటర్ తౌఫీక్ ఉమర్ కరోనా వైరస్ నుంచి కోలుకున్నాడు. రెండు వారాల పాటు హోం క్వారంటైన్‌లో ఉన్న అతను ఇప్పుడు ఆరోగ్యకరంగా ఉన్ననని ప్రకటించాడు. ఇప్పటికే కరోనా మహమ్మారి సోకి ఇద్దరు పాకిస్థానీ మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్లు రియాజ్ షేక్, జాఫర్ సర్ఫరాజ్ ప్రాణాలు కోల్పోయారు. కానీ, కరోనా వైరస్ సోకిందని తెలియగానే తన కుటుంబానికి దూరం ఐసోలేషన్‌లో ఉన్న తౌఫీక్.. కోలుకున్నాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ‘‘కోవిడ్-19ను ప్రతి ఒక్కరు పెను ప్రమాదంగా పరిగణించాలి. అందరూ సామాజిక దూరంతో పాటు అన్న జాగ్రత్తలు ప్రకటించాలి. నేను రెండు వారాల పాటు నా కుటుంబానికి దూరంగా.. ఒక రూంలో ఐసోలేషన్‌లో ఉన్నాను. ఒకవేళ పాజిటివ్ వస్తే ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. అందుకు బదులుగా వాళ్లు తమ రోగనిరోధక శక్తిని పెంచుకొనేందుకు కృషి చేయాలి’’ అని అన్నాడు. 

Updated Date - 2020-06-06T23:23:12+05:30 IST