రిజర్వు ఆటగాళ్లకూ కరోనా టెస్టులు: పీసీబీ

ABN , First Publish Date - 2020-06-26T03:21:43+05:30 IST

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఐదుగురు రిజర్వు ప్లేయర్లు, బ్యాకప్ ప్లేయర్‌కు కరోనా పరీక్షలు

రిజర్వు ఆటగాళ్లకూ కరోనా టెస్టులు: పీసీబీ

కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఐదుగురు రిజర్వు ప్లేయర్లు, బ్యాకప్ ప్లేయర్‌కు కరోనా పరీక్షలు నిర్వహించినట్టు గురువారం తెలిపింది. బిలాల్ అసిఫ్, ఇమ్రాన్ బట్, మొహమ్మద్ నవాజ్, ముసాఖాన్, రోహైల్ నజీర్, మొహమ్మద్ ఇమ్రాన్‌లకు కరోనా పరీక్షలు చేసినట్టు పేర్కొంది. ఈ నెల 12న ప్రకటించిన 29 మంది సభ్యులతో కూడిన జట్టులో అసిఫ్, బట్, నవాజ్, ఖాన్‌లను రిజర్వు ప్లేయర్లుగా పీసీబీ పేర్కొంది. నజీర్ బ్యాకప్ వికెట్ కీపర్. 


18 మంది ఆటగాళ్లు, 11 మంది సహాయక సిబ్బందికి గురువారం రెండోసారి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు పీసీబీ తెలిపింది. అలాగే, ఈ వారం మొదట్లో కరోనా బారినపడిన 10 మంది ఆటగాళ్లు, ఒక సహాయకుడికి శుక్రవారం తిరిగి పరీక్షలు నిర్వహించనున్నట్టు వివరించింది. ఇందుకు సంబంధించిన ఫలితాలను శనివారం వెల్లడిస్తామని పేర్కొంది.  

Updated Date - 2020-06-26T03:21:43+05:30 IST