పాక్ లక్ష్యం 373: ప్రస్తుతం 71/3
ABN , First Publish Date - 2020-12-30T07:01:42+05:30 IST
పాకిస్థాన్‌తో తొలి టెస్ట్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ గెలుపు దిశగా సాగుతోంది. బ్లండెల్ (64), లాథమ్ (53) అర్ధ

మౌంట్ మాంగనుయ్: పాకిస్థాన్‌తో తొలి టెస్ట్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ గెలుపు దిశగా సాగుతోంది. బ్లండెల్ (64), లాథమ్ (53) అర్ధ సెంచరీలతో రాణించడంతో.. నాలుగో రోజైన మంగళవారం రెండో ఇన్నింగ్స్‌ను కివీస్ 180/5 వద్ద డిక్లేర్ చేసింది. 373 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్ బ్యాటింగ్ వైఫల్యంతో ఆట చివరకు 71/3 స్కోరుతో కష్టాల్లో పడింది.
ఓపెనర్ మసూద్ (0), హారిస్ సొహైల్ (9)ను అవుట్ చేసిన పేసర్ టిమ్ సౌథీ 300 వికెట్ల క్లబ్‌లో చేశాడు. తద్వారా రిచర్డ్ హ్యాడ్లీ (431), వెట్టోరి (361) తర్వాత ఈ ఘనత సాధించిన మూడో కివీస్ బౌలర్‌గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 431, పాక్ 239 స్కోర్లు చేశాయి.