డ్రగ్స్ వాడమన్నారు: షోయబ్ అక్తర్
ABN , First Publish Date - 2020-11-25T02:44:21+05:30 IST
పేస్ బౌలర్లు ఎంతమంది వచ్చినా పాక్ దిగ్గజం షోయబ్ అక్తర్‌కు ఉండే గుర్తింపే వేరు. ఇండియా-పాక్ క్రికెట్ మ్యాచ్ అంటే సచిన్, షోయబ్‌ల మధ్య పోరులా ఫాన్స్ చూసేవారు. అయితే అలాంటి షోయబ్ అక్తర్‌కు...
ఇస్లామాబాద్: పేస్ బౌలర్లు ఎంతమంది వచ్చినా పాక్ దిగ్గజం షోయబ్ అక్తర్‌కు ఉండే గుర్తింపే వేరు. ఇండియా-పాక్ క్రికెట్ మ్యాచ్ అంటే సచిన్, షోయబ్‌ల మధ్య పోరులా ఫాన్స్ చూసేవారు. అయితే అలాంటి షోయబ్ అక్తర్‌కు బౌలింగ్ స్పీడ్ పెంచుకోవడానికి డ్రగ్స్ వాడాలని అనేకమంది సలహా ఇచ్చారట. ఈరోజు జరిగిన పాకీస్తాన్ యాంటీ నార్కోటిక్స్ ఫోర్సెస్ సమావేశంలో పాల్గొన్న అక్తర్ తాను బౌలర్‌గా ఉన్నప్పటి పరిస్థితుల గురించి వివరించాడు. తాను బౌలర్‌గా ఉన్నప్పుడు వేగాన్ని పెంచుకునేందుకు ఎంతో కృషి చేసేవాడినని, అయితే కొంతమంది డ్రగ్స్ వాడాలని సలహా ఇచ్చేవారని, డ్రగ్స్ వాడితేనే ఎక్కవ కాలం స్పీడ్‌గా బౌలింగ్ చేయగలుగుతానని, లేకుంటే కెరీర్ మధ్యలోనే ముగిసిపోతుందని భయపెట్టేవారని అక్తర్ చెప్పుకొచ్చాడు.
అయితే తాను ఏనాడూ వారి మాటలను వినలేదని, అనుక్షణం పట్టుదలతో శ్రమించేవాడినని, దాని ఫలితంగానే సుదీర్ఘకాలం కెరీర్‌ను కొనసాగించగలిగానని వివరించాడు. అయితే తనను డ్రగ్స్ తీసుకోమని ప్రోత్సహించిన ఆటగాళ్ల పేర్లను మాత్రం షోయబ్ బయటపెట్టలేదు. కానీ ప్రస్తుత యువ ఆటగాళ్లు కూడా ఇలాంటి పరిస్థితులను తప్పకుండా ఎదుర్కొంటారని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని, ఎట్టిపరిస్థితుల్లో లొంగిపోవద్దని హెచ్చరించాడు.