నాలుగు లీగుల్లో ఆడేందుకు పాక్ క్రికెటర్లకు అనుమతి

ABN , First Publish Date - 2020-03-29T03:35:45+05:30 IST

పాకిస్థాన్ క్రికెటర్లు గరిష్టంగా నాలుగు విదేశీ లీగుల్లో ఆడేందుకు పీసీబీ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తన కొత్త నో

నాలుగు లీగుల్లో ఆడేందుకు పాక్ క్రికెటర్లకు అనుమతి

ఇస్లామాబాద్: పాకిస్థాన్ క్రికెటర్లు గరిష్టంగా నాలుగు విదేశీ లీగుల్లో ఆడేందుకు పీసీబీ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తన కొత్త నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) విధాన్ని విడుదల చేసింది. దీని ప్రకారం.. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీసీబీ) సహా గరిష్టంగా నాలుగు విదేశీ లీగుల్లో కాంట్రాక్ట్ ఆటగాళ్లు పాల్గొనవచ్చు. కొత్త విధానంలో అంతర్జాతీయ క్రికెట్ ఆపరేషన్స్ విభాగం, జాతీయ హెడ్ కోచ్/జట్టు మేనేజ్‌మెంట్ నుంచి అభ్యర్థలను వస్తాయని పీసీబీ తెలిపింది. ఆటగాళ్ల పనిభారం, అంతర్జాతీయ కమిట్‌మెంట్లను వీరు చూసుకుంటారని పేర్కొంది.  


దేశవాళీ ఆటగాళ్లు మాత్రం ఎన్‌వోసీ అనుమతుల కోసం తొలుత నేరుగా తమ అసోసియేషన్లను సంప్రదించాలని కోరింది. రెడ్ బాల్ క్రికెట్ ఆడని, వైట్ బాల్ క్రికెట్ రెగ్యులర్ అయిన దేశవాళీ క్రికెటర్లు ఎన్‌వోసీలకు అర్హత సాధించాలంటే 50 ఓవర్, 20 ఓవర్ పోటీలకు కట్టుబడి ఉండడం తప్పనిసరని బోర్డు స్పష్టం చేసింది. ఐసీసీ రెగ్యులేషన్స్ ప్రకారం.. ప్రస్తుతం ఆడుతున్న, రిటైర్ అయిన క్రికెటర్లు ఐసీసీ అమోదించిన ఈవెంట్లలో పాల్గొనేందుకు పీసీబీ నుంచి ఎన్‌వోసీ పొందడం తప్పనిసరని పేర్కొంది. 24 నెలలు అంతకంటే ముందు రిటైర్ అయిన ఆటగాళ్లకు కూడా పీసీబీ ఎన్‌వోసీ ఇవ్వనుంది. 

Updated Date - 2020-03-29T03:35:45+05:30 IST