కోహ్లీని శాంతంగా ఉంచితేనే..

ABN , First Publish Date - 2020-11-21T10:15:07+05:30 IST

రాబోయే టెస్ట్‌ సిరీ్‌సలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వికెట్‌ పడగొట్టడమే తన లక్ష్యమని ఆస్ట్రేలియా పేసర్‌ పాట్‌ కమిన్స్‌ ప్రకటించాడు.

కోహ్లీని శాంతంగా ఉంచితేనే..

సిడ్నీ: రాబోయే టెస్ట్‌ సిరీ్‌సలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వికెట్‌ పడగొట్టడమే తన లక్ష్యమని ఆస్ట్రేలియా పేసర్‌ పాట్‌ కమిన్స్‌ ప్రకటించాడు. నాలుగు టెస్ట్‌ల సిరీ్‌సలో తాము ఆధిపత్యం ప్రదర్శించాలంటే కోహ్లీని ప్రశాంతంగా ఉంచడం ముఖ్యమని అభిప్రాయపడ్డాడు. ‘టీమిండియాకు కోహ్లీ కీలక ఆటగాడు. అతడిని త్వరగా అవుట్‌ చేస్తే మ్యాచ్‌ను గెలవొచ్చు. వ్యాఖ్యాతలు విరాట్‌ గురించి నిరంతరాయంగా మాట్లాడతారు. అందువల్ల విరాట్‌ను మేం ప్రశాంతంగా ఉంచగలమన్న నమ్మకముంది’ అని ఆసీస్‌ వైస్‌-కెప్టెన్‌ కమిన్స్‌ అన్నాడు. 

Read more