ఆర్చర్‌కు జరిమానా
ABN , First Publish Date - 2020-07-19T09:08:23+05:30 IST
బయో సెక్యూర్ నిబంధనలను ఉల్లంఘించిన పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) హెచ్చరించడంతోపాటు...

మూడో టెస్టుకు అందుబాటులో పేసర్
లండన్: బయో సెక్యూర్ నిబంధనలను ఉల్లంఘించిన పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) హెచ్చరించడంతోపాటు జరిమానా కూడా విధించింది. గత సోమవారం వెస్టిండీ్‌సతో తొలి టెస్ట్ ముగిసిన అనంతరం ఇంగ్లండ్ ఆటగాళ్లు వ్యక్తిగత వాహనాల్లో రెండో టెస్ట్ వేదిక మాంచెస్టర్ వెళ్లారు. ఆర్చర్ కూడా కారులో వెళుతూ మార్గమధ్యలో బ్రైటన్‌లోని తన ఇంటిలో గంటపాటు గడిపాడు. ఆ తర్వాత మాంచెస్టర్ చేరుకున్నాడు. గర్ల్‌ఫ్రెండ్‌ను కలుసుకొనేందుకే ఆర్చర్ ఇంటికి వెళ్లినట్టు కూడా వార్తలొచ్చాయి. దాంతో నిబంధనలు బేఖాతరు చేసిన ఆర్చర్‌ను ఇక్కడ జరుగుతున్న రెండో టెస్ట్ జట్టునుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ‘ఆర్చర్‌పై విచారణ జరిపాం. నిబంధనలను ఉల్లంఘించిన అతడిని అధికారికంగా హెచ్చరించడంతోపాటు బయటకు వెల్లడించని మొత్తం జరిమానాగా విధించాం’ అని ఈసీబీ శనివారం తెలిపింది. కాగా.. మూడో టెస్టుకు ఆర్చర్ అందుబాటులో ఉంటాడు.