నేషన్స్‌ చెస్‌లో భారత్‌కు ఐదోస్థానం

ABN , First Publish Date - 2020-05-10T10:14:33+05:30 IST

ఆన్‌లైన్‌ నేషన్స్‌ చెస్‌ కప్‌లో భారత్‌ ఐదోస్థానంతో సరిపెట్టుకుంది. రౌండ్‌రాబిన్‌ లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన చివరి రెండు రౌండ్లలో..

నేషన్స్‌ చెస్‌లో భారత్‌కు ఐదోస్థానం

చెన్నై: ఆన్‌లైన్‌ నేషన్స్‌ చెస్‌ కప్‌లో భారత్‌ ఐదోస్థానంతో సరిపెట్టుకుంది. రౌండ్‌రాబిన్‌  లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన చివరి రెండు రౌండ్లలో ఓడి టైటిల్‌ రేసు నుంచి తప్పుకొంది. శనివారం జరిగిన ఆఖరిదైన పదో రౌండ్లో భారత్‌ 1.5-2.5తో రష్యా చేతిలో ఓడింది. ఈ పోరులో భారత్‌ తరఫున హంపి మాత్రమే గేమ్‌ గెలవగా.. హరికృష్ణ తన గేమ్‌ను డ్రా చేసుకోగా.. విదిత్‌, అధిబన్‌ తమ గేముల్లో ఓడిపోయారు. అంతకుముందు 9వ రౌండ్లో భారత్‌ 1.5-2.5తో చైనా చేతిలో ఓడింది. రౌండ్‌రాబిన్‌లో తొలి రెండుస్థానాల్లో నిలిచిన చైనా, అమెరికా ఆదివారం జరిగే సూపర్‌ ఫైనల్లో టైటిల్‌ కోసం తలపడతాయి. యూర్‌పకు మూడు, రష్యాకు నాలుగో స్థానాలు దక్కాయి. 

Updated Date - 2020-05-10T10:14:33+05:30 IST