ఐపీఎల్ స్పాన్సర్‌షిప్‌ను సొంతం చేసుకున్న డ్రీమ్11

ABN , First Publish Date - 2020-08-18T21:12:22+05:30 IST

ఐపీఎల్ స్పాన్సర్‌షిప్‌ను ఆన్‌లైన్ ఫ్యాంటసీ లీగ్ సంస్థ డ్రీమ్11 సొంతం చేసుకుంది. మొత్తం రూ.222 కోట్లకు బిడ్..

ఐపీఎల్ స్పాన్సర్‌షిప్‌ను సొంతం చేసుకున్న డ్రీమ్11

న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాన్సర్‌షిప్‌ను ఆన్‌లైన్ ఫ్యాంటసీ లీగ్ సంస్థ డ్రీమ్11 సొంతం చేసుకుంది. మొత్తం రూ.222 కోట్లకు బిడ్ దాఖలు చేసి గెలుచుకుంది. చైనీస్ మొబైల్ సంస్థ వివోను ఐపీఎల్ స్పాన్సర్‌షిప్‌ నుంచి బీసీసీఐ తొలగించిన విషయం తెలిసిందే. బాయ్‌కాట్ చైనా నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి మరో స్పాన్సర్ కోసం బీసీసీఐ వెతుకుతోంది. ఈ నేపథ్యంలో స్పాన్సర్‌షిప్ కోసం బిడ్డింగ్ నిర్వహించింది. అందులో డ్రీమ్11 గెలిచి స్పాన్సర్‌షిప్‌ను సొంతం చేసుకుంది.

Updated Date - 2020-08-18T21:12:22+05:30 IST