ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు కరోనా బారినపడుతున్న సఫారీ క్రికెటర్లు
ABN , First Publish Date - 2020-11-21T22:03:55+05:30 IST
మరో క్రికెటర్‌కు వైరస్ సంక్రమించింది. దీంతో అతడిని జట్టు నుంచి వేరు చేసి ఐసోలేషన్‌కు పంపారు. జట్టు వైద్య బృందం ఆటగాడి శారీరక

కేప్‌టౌన్: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు దక్షిణాఫ్రికా క్రికెటర్లు వరుసగా కొవిడ్ బారినపడుతున్నారు. మొన్ననే ఓ ఆటగాడు మహమ్మారి బారినపడి ఐసోలేషన్‌లోకి వెళ్లగా, తాజాగా మరో క్రికెటర్‌కు వైరస్ సంక్రమించింది. దీంతో అతడిని జట్టు నుంచి వేరు చేసి ఐసోలేషన్‌కు పంపారు. జట్టు వైద్య బృందం ఆటగాడి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని జట్టు మేనేజ్‌మెంట్ తెలిపింది. అయితే, కరోనా బారినపడిన ఆటగాడు ఎవరనేది మాత్రం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్లడించలేదు. కాగా, ఓ ఆటగాడు కరోనా బారినపడ్డాడని, ముందు జాగ్రత్త చర్యగా ముగ్గురు ఆటగాళ్లను సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంచినట్టు బుధవారం క్రికెట్ సౌతాఫ్రికా తెలిపింది. ఇంగ్లండ్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు జరగనుండగా ఈ నెల 27న కేప్‌టౌన్‌లో తొలి టీ20 జరగనుంది.