వచ్చేసింది వన్డే సూపర్‌ లీగ్‌

ABN , First Publish Date - 2020-07-28T08:11:18+05:30 IST

భారత్‌ వేదికగా జరగాల్సిన 2023 వన్డే ప్రపంచ కప్‌నకు అర్హత కోసం సూపర్‌ లీగ్‌ టోర్నీని

వచ్చేసింది వన్డే సూపర్‌ లీగ్‌

దుబాయ్‌: భారత్‌ వేదికగా జరగాల్సిన 2023 వన్డే ప్రపంచ కప్‌నకు అర్హత కోసం సూపర్‌ లీగ్‌ టోర్నీని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అధికారికంగా ప్రకటించింది. ఈనెల 30న ఇంగ్లండ్‌తో ఐర్లండ్‌ జట్టు తలపడే మూడు వన్డేల సిరీస్‌తో సూపర్‌ లీగ్‌ మొదలుకానుంది. 12 ఐసీసీ సభ్యదేశాలతో పాటు నెదర్లాండ్స్‌.. మొత్తంగా 13 జట్లు ఈ సూపర్‌ లీగ్‌లో పోటీపడతాయి. లీగ్‌లో భాగంగా ప్రతి జట్టు స్వదేశంలో నాలుగు, విదేశంలో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ చొప్పున ఆడాల్సి ఉంటుంది.


ఇవి మూడు మ్యాచ్‌ల సిరీస్‌గా జరగనున్నాయి. సూపర్‌ లీగ్‌లో మ్యాచ్‌ గెలిచిన ఒక్కో జట్టుకు 10 పాయింట్లు దక్కుతాయి. మ్యాచ్‌ రద్దయినా, టై అయినా ఇరుజట్ల ఖాతాలో ఐదేసి పాయింట్లు చేరుతాయి. మొత్తం పది దేశాలు పాల్గొనే ప్రపంచకప్‌లో పూర్తిస్థాయి సభ్యత్వం కలిగిన టాప్‌ ఏడు జట్లు, ఆతిథ్య హోదా దేశంతో కలిపి మొత్తంగా ఎనిమిది జట్లు నేరుగా మెగా టోర్నీకి అర్హత సాధిస్తాయి. మిగిలిన రెండు జట్ల కోసం ఈ క్వాలిఫికేషన్‌ రౌండ్‌ నిర్వహిస్తున్నారు. ఈ వన్డే సూపర్‌ లీగ్‌ 2022 చివరిదాకా కొనసాగనుంది.  

Updated Date - 2020-07-28T08:11:18+05:30 IST