యాషెస్ అంత గొప్ప.. భారత్-ఆసీస్ సిరీస్‌పై బ్రెట్ లీ

ABN , First Publish Date - 2020-07-21T02:39:33+05:30 IST

ఈ ఏడాది చివర్లో జరగనున్న భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌పై ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

యాషెస్ అంత గొప్ప.. భారత్-ఆసీస్ సిరీస్‌పై బ్రెట్ లీ

కాన్‌బెర్రా: ఈ ఏడాది చివర్లో జరగనున్న భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌పై ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. భారత్-ఆసీస్ సిరీస్ కూడా యాషెస్ కన్నా ఏకోశానా తక్కువ కాదని బ్రెట్ లీ చెప్పాడు. ‘ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్ అత్యద్భుతం. క్రికెట్‌లో దాన్ని మించిన సిరీస్ మరోటి లేదు. అయితే ప్రస్తుతం ఇండియా-ఆస్ట్రేలియా సిరీస్ కూడా అంత గొప్పదని భావిస్తున్నా’ అని బ్రెట్ లీ అన్నాడు. ప్రపంచ క్రికెట్‌లో ఇండియా-పాకిస్తాన్ తర్వాత అంత పోటాపోటీగా జరిగే సిరీస్ యాషెస్. ఇంగ్లండ్-ఆసీస్ మధ్య జరిగే ఈ సిరీస్‌కు ప్రపంచ క్రికెట్‌లో ప్రత్యేకమైన స్థానం ఉంది.

Updated Date - 2020-07-21T02:39:33+05:30 IST