సచిన్‌పై అసభ్యకర పోస్టులు

ABN , First Publish Date - 2020-08-08T09:15:31+05:30 IST

భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌పై సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన ఓ వ్యక్తిని ముంబై పోలీసులు గురువారం అదుపులోకి ...

సచిన్‌పై అసభ్యకర పోస్టులు

పిడుగురాళ్లకు చెందిన వ్యక్తి అరెస్టు

పిడుగురాళ్ల: భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌పై సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన ఓ వ్యక్తిని ముంబై పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. సచిన్‌ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ముంబై సైబర్‌ క్రైం బ్రాంచి పోలీసులు రంగంలోకి దిగారు. ఐపీ అడ్రస్‌ ఆధారంగా ఆ పోస్టులు పెట్టిన వ్యక్తి గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన వందనపు నాగరాజుగా గుర్తించారు. స్థానిక పోలీసుల సహకారంతో అతణ్ణి అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.


Updated Date - 2020-08-08T09:15:31+05:30 IST