అలా అవుటవడం అసలు నచ్చలేదు.. శుభ్‌మన్ గిల్ అసంతృప్తి

ABN , First Publish Date - 2020-12-28T12:51:58+05:30 IST

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్టు సిరీస్ జరుగుతోంది. తొలి టెస్టులో రెండో ఇన్నింగ్సులో ఘోరంగా విఫలయం అయిన భారత జట్టు ఓటమిని మూటగట్టుకుంది.

అలా అవుటవడం అసలు నచ్చలేదు.. శుభ్‌మన్ గిల్ అసంతృప్తి

మెల్‌బోర్న్: బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్టు సిరీస్ జరుగుతోంది. తొలి టెస్టులో రెండో ఇన్నింగ్సులో ఘోరంగా విఫలయం అయిన భారత జట్టు ఓటమిని మూటగట్టుకుంది. దీంతో రెండో టెస్టు మ్యాచును ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బరిలో దిగింది. ఈ క్రమంలో మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టెస్టు మ్యాచులో శుభ్‌మన్ గిల్(45) ఫర్వాలేదనిపించాడు. అంతర్జాతీయ స్థాయిలో గిల్‌కు ఇదే తొలి టెస్టు కావడం విశేషం. అయితే ఈ మ్యాచులో అవుటైన తీరు తనకు అస్సలు నచ్చలేదని గిల్ చెప్పాడు. ‘‘అది కమిన్స్ స్పెల్ ఆఖరి బంతి. నేను ఓ చెత్త షాట్ ఆడా. కసిగా ఆడాలని అనుకున్న కానీ ఇలా జరిగింది. మంచి భాగస్వామ్యం ఏర్పాటు చేయాలని అనుకొని అది మాత్రం చేయగలిగా’’ అని గిల్ చెప్పాడు. తను అవుటైన విధానం విషయంలో మాత్రం చాలా అసంతృప్తిగా ఉన్నానని స్పష్టం చేశాడు.

Updated Date - 2020-12-28T12:51:58+05:30 IST