నార్త్‌ఈస్ట్-గోవా మ్యాచ్‌ డ్రా

ABN , First Publish Date - 2020-12-01T09:34:23+05:30 IST

పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరాలని నార్త్‌ఈస్ట్‌.. లీగ్‌లో బోణీ కొట్టాలని బరిలోకి దిగిన గోవాకు నిరాశే ఎదురైంది. సోమవారం ఈ రెండు జట్ల మధ్య జరిగిన

నార్త్‌ఈస్ట్-గోవా మ్యాచ్‌ డ్రా

గోవా: పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరాలని నార్త్‌ఈస్ట్‌.. లీగ్‌లో బోణీ కొట్టాలని బరిలోకి దిగిన గోవాకు నిరాశే ఎదురైంది. సోమవారం ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ 1-1తో ఫలితం తేలకుండా ముగిసింది. ఆట 40వ నిమిషంలో నార్త్‌ఈ్‌స్టకు లభించిన పెనాల్టీ కిక్‌ను ఆ జట్టు స్టార్‌ స్ట్రయికర్‌ ఇడ్రిశా సిల్లా గోల్‌గా మలిచి ఆధిక్యంలో నిలిపాడు. సరిగ్గా మరో రెండో నిమిషాల్లో తొలి అర్ధభాగం ముగుస్తుందనగా గోవా స్ట్రయికర్‌ ఇగోర్‌ అంగులో గోల్‌ చేసి 1-1తో స్కోరును సమం చేశాడు. ఇక, రెండో అర్ధభాగంలో ఇరు జట్లు గెలుపు కోసం చివరి వరకు పోరాడినా మరో గోల్‌ చేయలేకపోవడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

Updated Date - 2020-12-01T09:34:23+05:30 IST