నో షేక్‌ హ్యాండ్‌!

ABN , First Publish Date - 2020-03-04T09:54:00+05:30 IST

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో క్రికెటర్లు కూడా జాగ్రత్తలు పాటిస్తున్నారు. శ్రీలంక పర్యటనలో తమ ఆటగాళ్లు కరచాలనం చేయరని ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ స్పష్టం చేశాడు. రెండు టెస్ట్‌ల సిరీస్‌ కోసం ఈనెల 19 నుంచి లంకలో ఇంగ్లండ్‌

నో షేక్‌ హ్యాండ్‌!

లండన్‌: కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో క్రికెటర్లు కూడా జాగ్రత్తలు పాటిస్తున్నారు. శ్రీలంక పర్యటనలో తమ ఆటగాళ్లు కరచాలనం చేయరని ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ స్పష్టం చేశాడు. రెండు టెస్ట్‌ల సిరీస్‌ కోసం ఈనెల 19 నుంచి లంకలో ఇంగ్లండ్‌ పర్యటించనుంది. కరచాలనానికి బదులు ‘ఫిస్ట్‌ బంప్‌ (పిడికిలితో పలకరింత)’తో పలకరిస్తామని రూట్‌ చెప్పాడు. దక్షిణాఫ్రికా టూర్‌లో ఇంగ్లండ్‌ ప్లేయర్లతోపాటు సహాయ సిబ్బంది కూడా ఫ్లూ, ఉదర సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ఇంగ్లీష్‌ ఆటగాళ్లు జాగ్రత్తలు తీసుకుంటునారు. 

Updated Date - 2020-03-04T09:54:00+05:30 IST