టెస్టులపై సెహ్వాగ్ ముద్ర ఎవరూ చెరపలేరు: గంభీర్
ABN , First Publish Date - 2020-07-27T23:46:10+05:30 IST
భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ టెస్టు క్రికెట్‌పై ప్రత్యేకమైన ముద్ర వేశాడని మరో మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు.

న్యూఢిల్లీ: భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ టెస్టు క్రికెట్‌పై ప్రత్యేకమైన ముద్ర వేశాడని మరో మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. టెస్టు క్రికెట్‌పై సెహ్వాగ్ ముద్రను మరో ఆటగాడెవరూ చెరపలేడని గంభీర్ చెప్పాడు. ‘టెస్టుల్లో సెహ్వాగ్ సక్సెస్ అవుతాడని ఎవరూ ఊహించలేదు. కానీ అతని రికార్డులు గమనిస్తే టెస్టుల్లోనే సెహ్వాగ్ బాగా సక్సెస్ అయినట్లు తెలుస్తుంది’ అని వెల్లడించాడు. తన కెరీర్‌లో 104 టెస్టులు ఆడిన సెహ్వాగ్ 8,586 పరుగులు చేశాడు. అదే విధంగా 251 వన్డేల్లో 8,273 రన్స్ చేశాడు.