ప్రభావశీల స్త్రీల జాబితాలో నీతా అంబానీ

ABN , First Publish Date - 2020-03-13T10:37:23+05:30 IST

ప్రభావశీల స్త్రీల జాబితాలో నీతా అంబానీ

ప్రభావశీల స్త్రీల జాబితాలో నీతా అంబానీ

న్యూఢిల్లీ: క్రీడారంగంలో అత్యంత ప్రభావశీల టాప్‌ పది మంది మహిళల జాబితాలో ముంబై ఇండియన్స్‌ అధినేత్రి నీతా అంబానీకి చోటు లభించింది.  స్పోర్ట్స్‌ బిజినెస్‌ నెట్‌వర్క్‌, ఐస్పోర్ట్‌ కనెక్ట్‌ సంస్థలు ఈ జాబితాను విడుదల చేశాయి. తొలుత 25 మందితో కూడిన జాబితాను రూపొందించగా, వడపోత అనంతరం పదిమంది పేర్లను ప్రకటించారు. టెన్నిస్‌ సూపర్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌, జిమ్నాస్ట్‌  సిమోన్‌ బైల్స్‌కి కూడా ఈ జాబితాలో చోటు దక్కింది.

Updated Date - 2020-03-13T10:37:23+05:30 IST