హాఫ్ సెంచరీ చేసిన నికోలస్.. కివీస్ స్కోర్ ఎంతంటే..!

ABN , First Publish Date - 2020-02-05T19:07:25+05:30 IST

348 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు గుప్తిల్, నికోలస్ జోడీ..

హాఫ్ సెంచరీ చేసిన నికోలస్.. కివీస్ స్కోర్ ఎంతంటే..!

348 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది.  ఓపెనర్లు గుప్తిల్, నికోలస్ జోడీ.. 16 ఓవర్ వరకు వికెట్ పడకుండా నిలబడింది. జట్టు స్కోర్ 85 పరుగుల దగ్గర ఒపెనర్ మార్టిన్ గుప్తిల్(32) పెవిలియన్ చేరాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో కేదార్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్రండెల్(9) రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. కుల్దీప్ బౌలింగ్‌లో స్టంప్ అవుట్ అయ్యాడు. ఇదిలా ఉంటే మరో ఓపెనర్ నికోలస్ హాఫ్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం క్రీజులో నికోలస్, టేలర్ క్రీజులో ఉన్నారు. కివీస్ స్కోర్ రెండు వికెట్లకు 109 పరుగులు.   

Updated Date - 2020-02-05T19:07:25+05:30 IST