తొలి వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్
ABN , First Publish Date - 2020-02-08T14:24:11+05:30 IST
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడి ఈడెన్ పార్క్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో భారత్

ఆక్లాండ్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడి ఈడెన్ పార్క్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. భారత బౌలర్లను ధీటుగా ఎదురుకుంటూ.. తొలి వికెట్‌కి 93 పరుగులు జోడించారు. అయితే చాహల్ వేసిన 17వ ఓవర్ ఐదో బంతికి హెర్నీ నికోలస్(41) ఎల్‌బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ చేరాడు. దీంతో 18 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ 1 వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజ్‌లో గుప్టిల్(49), టామ్ బ్లండెల్(2) ఉన్నారు.