కివీస్‌.. క్లీన్‌స్వీ్‌ప

ABN , First Publish Date - 2020-12-15T06:00:51+05:30 IST

వెస్టిండీ్‌సతో రెండు టెస్టుల సిరీ్‌సను ఆతిథ్య న్యూజిలాండ్‌ 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆఖరిదైన రెండో టెస్టులో విండీ్‌సను ఇన్నింగ్స్‌ 12 పరుగుల తేడాతో చిత్తు చేసింది...

కివీస్‌.. క్లీన్‌స్వీ్‌ప

  •  2-0తో టెస్టు సిరీస్‌ కైవసం
  •  ఇన్నింగ్స్‌ తేడాతో ఓడిన విండీస్‌ 

వెల్లింగ్టన్‌: వెస్టిండీ్‌సతో రెండు టెస్టుల సిరీ్‌సను ఆతిథ్య న్యూజిలాండ్‌ 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆఖరిదైన రెండో టెస్టులో విండీ్‌సను ఇన్నింగ్స్‌ 12 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఫాలో-ఆన్‌లో 244/6తో ఆటకు నాలుగో రోజైన సోమవారం బరిలోకి దిగిన విండీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 317 పరుగులకు ఆలౌటైంది. హోల్డర్‌ (61), జోషువా డసిల్వ (57)తో ఏడో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. బౌల్ట్‌, వాగ్నర్‌ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. జేమిసన్‌కు రెండు దక్కాయి. జేమిసన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 460 రన్స్‌.. విండీస్‌ 131 రన్స్‌ చేశాయి. తొలి టెస్టులోనూ న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ 134 పరుగుల తేడాతో  గెలిచింది. ఈ సిరీస్‌ విజయంతో 120 పాయింట్లు సాధించిన కివీస్‌.. టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న ఆస్ట్రేలియా సరసన నిలిచింది. అంతేకాదు.. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌ప ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌ను వెనక్కునెట్టి మూడో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా, భారత్‌ టాప్‌-2లో ఉన్నాయి. 

Updated Date - 2020-12-15T06:00:51+05:30 IST