క్రికెట్‌లో కొత్త రూల్.. ఇక బ్యాట్స్‌మెన్‌కు పండగే!
ABN , First Publish Date - 2020-12-11T17:35:16+05:30 IST
క్రికెట్ మారుతోంది. మరి రూల్స్ ఎందుకు మారకూడదు..? ఆస్ట్రేలియా క్రికెట్ లీగ్ కూడా ఇదే ఆలోచించింది. అంతే కొన్ని కొత్త నిబంధనలను క్రికెట్‌కు పరిచయం చేసింది. పవర్ సర్జ్, ఎక్స్-ఫాక్టర్, బ్యాష్ బూస్టర్ అనే 3 కొత్త రూల్స్‌ను...
కాన్‌బెర్రా: క్రికెట్ మారుతోంది. మరి రూల్స్ ఎందుకు మారకూడదు..? ఆస్ట్రేలియా క్రికెట్ లీగ్ కూడా ఇదే ఆలోచించింది. అంతే కొన్ని కొత్త నిబంధనలను క్రికెట్‌కు పరిచయం చేసింది. పవర్ సర్జ్, ఎక్స్-ఫాక్టర్, బ్యాష్ బూస్టర్ అనే 3 కొత్త రూల్స్‌ను పొట్టి ఫార్మాట్ బిగ్ బ్యాష్ లీగ్ 2020-21లో తొలిసారిగా అమలు చేసింది. ఇందులో పవర్ సర్జ్ విధానం ప్రకారం ఇన్నింగ్స్‌లో తొలి పవర్ ప్లేని 4 ఓవర్లకు కుదంచడం జరుగుతుంది. మిగిలిన 2 ఓవర్లను ఇన్నింగ్స్ 10వ ఓవర్ తరువాత ఎప్పుడైనా తీసుకునే స్వేచ్ఛ బ్యాటింగ్ జట్టుకుంటుంది. దీనివల్ల బ్యాటింగ్ జట్టుకు అదనపు పరుగులు రాబట్టుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. సిడ్నీ సిక్సర్స్, హోబార్ట్ హర్రికేన్స్ మధ్య గురువారం జరిగిన తొలి బీబీఎల్ మ్యాచ్‌లో ఈ నిబంధన మొదటగా అమల్లోకొచ్చింది.
మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హోబార్ట్ హర్రికేన్స్ పవర్ సర్జ్‌ను మొట్టమొదటి సారిగా వినియోగించుకుంది. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో పవర్ సర్జ్‌ను వినియోగించుకున్న హోర్రికేన్స్ ఆ రెండు ఓవర్లలో చక్కటి పరుగులు రాబట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ నిబంధనలపై క్రికెట్ నిపుణులు, క్రీడా ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ అంటే ఇప్పటికే బ్యాటింగ్ గేమ్ అనే విషయం ప్రచారంలో ఉందని, ఇప్పుడు ఇలాంటి విధానాల వద్ద బ్యాట్స్‌మెన్‌కు మరింత స్వేచ్ఛ లభిస్తుందని, గెలిచే అవకాశం ఉన్నట్లుండి పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల బౌలర్లు తీవ్రంగా నష్టోతారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ రూల్స్ బిగ్ బ్యాష్ లీగ్‌కే పరిమితమవుతుందా..? లేక ఐసీసీ కూడా మొత్తం క్రికెట్‌లో వీటిని అమలు చేస్తుందా..? అనేదానిపై ఇప్పటికైతే క్లారిటీ లేదు.