మహిళల సర్ఫింగ్‌లో గిన్నిస్ రికార్డు
ABN , First Publish Date - 2020-09-14T09:37:08+05:30 IST
మహిళల సర్ఫింగ్‌లో బ్రెజిల్‌కు చెందిన 33 ఏళ్ల మయా గబేరా గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ఇటీవల పోర్చుగల్‌లోని నజారే తీరంలో గబేరా 73.5 (22 మీటర్లు) అడుగుల ఎత్తైన అలపై సర్ఫింగ్ చేసి గత రికార్డులను తుడిచిపెట్టింది
లిస్బన్ (పోర్చుగల్): మహిళల సర్ఫింగ్‌లో బ్రెజిల్‌కు చెందిన 33 ఏళ్ల మయా గబేరా గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ఇటీవల పోర్చుగల్‌లోని నజారే తీరంలో గబేరా 73.5 (22 మీటర్లు) అడుగుల ఎత్తైన అలపై సర్ఫింగ్ చేసి గత రికార్డులను తుడిచిపెట్టింది. గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు మయా సర్ఫింగ్ వీడియోని పరిశీలించి ఈనెల 10న అధికారికంగా ఆమె పేరును ప్రకటించారు. మయా 2013లో ఇదే తీరంలో ఎతైన అలపై సర్ఫింగ్ చేయడానికి ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకొంది. ఆ తర్వాత చాలాకాలానికి కోలుకున్న ఆమె తిరిగి సర్ఫింగ్ కెరీర్‌ను ప్రారంభించి గిన్నిస్ రికార్డు సాధించడం విశేషం.