నాడియా సంచలనం
ABN , First Publish Date - 2020-10-07T09:14:38+05:30 IST
అర్జెంటీనా క్వాలిఫయర్ నాడియా పొడొరోస్కా చరిత్ర సృష్టించింది.

మూడో సీడ్ స్విటోలినాకు షాక్
క్వాలిఫయర్‌గా సెమీ్‌సకు
ఫ్రెంచ్ ఓపెన్
పారిస్: అర్జెంటీనా క్వాలిఫయర్ నాడియా పొడొరోస్కా చరిత్ర సృష్టించింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడో సీడ్ ఎలెనా స్విటోలినాపై సంచలన విజయంతో సెమీ్‌సకు చేరుకొంది. ఈ క్రమంలో ఓపెన్ ఎరాలో క్వాలిఫయర్‌గా బరిలోకి దిగి ఫ్రెంచ్ ఓపెన్ సెమీస్ చేరిన తొలి క్రీడాకారిణిగా 23 ఏళ్ల నాడియా రికార్డులకెక్కింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో అన్‌సీడెడ్ నాడియా 6-2, 6-4తో స్విటోలినా (ఉక్రెయిన్)పై వరుసగా సెట్లలో నెగ్గింది. ఒకరి సర్వీ్‌సలను మరొకరు బ్రేక్ చేసుకోవడంతో తొలి సెట్ ఆసక్తిగా సాగింది. మొదటి గేమ్‌లోనే ప్రత్యర్థి సర్వీ్‌సను బ్రేక్ చేసిన స్విటోలినా 1-0తో ఆధిక్యం సాధించింది. అయితే, తర్వాతి గేమ్‌లో ప్రత్యర్థి సర్వీ్‌సను బ్రేక్ చేసిన నాడియా 1-1తో సమం చేసింది. మధ్యలో ఆధిక్యం చేతులు మారినా.. 8వ గేమ్‌లో స్విటోలినా సర్వీ్‌సను మరోసారి బ్రేక్ చేసిన నాడియా 6-2తో సెట్‌ను తన ఖాతాలో వేసుకొంది.
రెండో సెట్‌లో స్విటోలినా రెండు మ్యాచ్ పాయింట్లు కాపాడుకున్నా.. పొడొరోస్కా బ్యాక్ హ్యాండ్ విన్నర్‌తో 6-4తో నెగ్గి మ్యాచ్‌ను కైవసం చేసుకొంది. ఇంతకుముందు గ్రాండ్‌స్లామ్ టోర్నీ మెయిన్ డ్రాలో ఒక్క మ్యాచ్ కూడా నెగ్గని నాడియా.. ఈసారి ఏకంగా సెమీఫైనల్‌కు దూసుకెళ్లడం విశేషం. ఓవరాల్‌గా టెన్నిస్ చరిత్రలో ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్ చేరిన మూడో క్వాలిఫయింగ్ క్రీడాకారిణి నాడియా. గతంలో అలెగ్జాండ్రా స్టెవెన్సాన్ (1999లో వింబుల్డన్), క్రిస్టీనా డోరె (1978లో ఆస్ట్రేలియన్ ఓపెన్) ఈ ఘనత సాధించారు. కాగా, అమెరికా అమ్మాయిలు సోఫియా కెనిన్, డేనియల్ రోజ్ కొలిన్స్ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. నాలుగో రౌండ్ మ్యాచ్‌లో కెనిన్ 2-6, 6-2, 6-1తో ఫియోనా ఫెర్రో (ఫ్రాన్స్)పై, కొలిన్స్ 6-4, 4-6, 6-4తో అన్స్ జెబెర్ (ట్యునీషియా)పై గెలిచారు. పురుషుల ప్రీ క్వార్టర్స్‌లో పాబ్లో కెర్రెనో బుస్టా (స్పెయిన్) 6-2, 7-5, 6-2తో డేనియల్ అల్టమీర్ (జర్మనీ)పై నెగ్గాడు.
థీమ్‌కు ఝలక్
టైటిల్ ఫేవరెట్లలో ఒకడైన మూడో సీడ్, ఇటీవలి యూఎస్ ఓపెన్ విజేత డొమినిక్ థీమ్ క్వార్టర్స్‌లోనే ఓడి ఇంటిముఖం పట్టాడు. పురుషుల సింగిల్స్‌లో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో అర్జెంటీనా ఆటగాడు డిగో స్కవర్జ్‌మన్ చేతిలో థీమ్ (ఆస్ట్రియా) పోరాడి ఓడాడు. థీమ్ 6-7(1), 7-5, 7-6(6), 6-7(5), 2-6తో 12వ సీడ్ స్కవర్జ్‌మన్ చేతిలో ఓడాడు.