‘లాక్‌డౌన్‌లో.. నా సిక్స్‌ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్‌లా మారింది’

ABN , First Publish Date - 2020-05-31T03:45:09+05:30 IST

లాక్‌డౌన్ కారణంగా దాదాపు మూడు నెలలుగా ప్రతిఒక్కరూ ఇళ్లలోనే ఉంటున్నారు.

‘లాక్‌డౌన్‌లో.. నా సిక్స్‌ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్‌లా మారింది’

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా దాదాపు మూడు నెలలుగా ప్రతిఒక్కరూ ఇళ్లలోనే ఉంటున్నారు. దీనిపై జావెలిన్ త్రోవర్ శివ్‌పాల్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ కారణంగా తాను బరువు పెరిగానని చెప్పాడు. ఉదయాన్నే ఆరుగంటలకు నిద్రలేవడం కూడా చాలా కష్టమైపోతోందని వాపోయాడు. ‘నాకు సిక్స్‌ప్యాక్ ఉండేది. కానీ లాక్‌డౌన్‌లో అది ఫ్యామిలీ ప్యాక్‌గా మారిపోయింది. మళ్లీ షేప్‌లోకి రావాలంటే కనీసం రెండు నెలలు కష్టపడాల్సిందే’ అని శివ్‌పాల్ పేర్కొన్నాడు.

Updated Date - 2020-05-31T03:45:09+05:30 IST