కీలక మ్యాచ్‌లో చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్‌మెన్!

ABN , First Publish Date - 2020-10-31T22:52:19+05:30 IST

ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. లీగ్ తొలి దశలో అద్భుత ఆటతీరుతో ప్రత్యర్థులను చిత్తుచేస్తూ

కీలక మ్యాచ్‌లో చేతులెత్తేసిన ఢిల్లీ బ్యాట్స్‌మెన్!

దుబాయ్: ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. లీగ్ తొలి దశలో అద్భుత ఆటతీరుతో ప్రత్యర్థులను చిత్తుచేస్తూ వచ్చిన శ్రేయాస్ సేన గత కొన్ని మ్యాచ్‌లుగా వరుస పరాజయాలను కొని తెచ్చుకుంటోంది. ముంబైతో తాజాగా జరుగుతున్న మ్యాచ్‌లో టాప్ నుంచి కింది వరకు ఆటగాళ్లు మొత్తం చేతులెత్తేశారు. క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరిగారు. ఫలితంగా కీలకమైన మ్యాచ్‌లో 9 వికెట్లు కోల్పోయి 110 పరుగులు మాత్రమే చేసి ప్రత్యర్థి ముంబై ఎదుట స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.


టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీకి తొలి ఓవర్ మూడో బంతికే ఎదురుదెబ్బ తగలింది. ఓపెనర్ శిఖర్ ధవన్ (0) డకౌట్ అయ్యాడు. అప్పుడు ప్రారంభమైన వికెట్ల పతనం చివరి ఓవర్ చివరి బంతి వరకు కొనసాగింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (25), రిషభ్ పంత్ (21) మినహా జట్టులో ఎవరూ సరిగా రాణించలేదు. పృథ్వీ షా 10, స్టోయినిస్ 2, హెట్‌మయర్ 11, హర్షల్ పటేల్ 5, రవిచంద్రన్ అశ్విన్ 12, ప్రవీణ్ దూబే 7, రబడ 12 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో బౌల్ట్, బుమ్రా చెరో మూడు వికెట్లు పడగొట్టగా, నైల్, రాహుల్ చాహర్ చెరో వికెట్ తీశారు. 

Read more