మావాడికి అంత వయసేం అయిపోలేదు

ABN , First Publish Date - 2020-05-13T09:47:00+05:30 IST

క్వారంటైన్‌లో ఉన్న ధోనీ తెల్లగడ్డంతో ఉన్న ఫొటోను అతడి భార్య సాక్షి ఇటీవల సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. మహీ లాక్‌డౌన్‌ లుక్‌ను చూసిన ఫ్యాన్స్‌.. అతడిలో క్రికెట్‌ ఆడే ఆసక్తి....

మావాడికి అంత వయసేం అయిపోలేదు

ధోనీ తల్లి దేవకి


న్యూఢిల్లీ: క్వారంటైన్‌లో ఉన్న ధోనీ తెల్లగడ్డంతో ఉన్న ఫొటోను అతడి భార్య సాక్షి ఇటీవల సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. మహీ లాక్‌డౌన్‌ లుక్‌ను చూసిన ఫ్యాన్స్‌.. అతడిలో క్రికెట్‌ ఆడే ఆసక్తి కనిపించడం లేదని పెదవి విరిచారు. కొందరైతే తెల్లగడ్డం చూసి ధోనీ వయసైపోయిందనే కామెంట్లు రాశారు. కానీ, ధోనీ తల్లి దేవకి మాత్రం తన కొడుకులో ఇంకా క్రికెట్‌ మిగిలి ఉందని నమ్ముతున్నట్టు చెప్పారు. ‘మహీ కొత్త లుక్‌ చూశా. అంత వయసు మీరిన వాడేమీ కాదు. కొడుకెప్పుడూ తల్లికి పిల్లవాడే. ఇక టీ20 వరల్డ్‌కప్‌ ఆడతాడో? లేదో? తెలియదు. కరోనా అదుపులోకి వచ్చిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది ధోనీకి బాగా తెలుస’ని దేవకి తెలిపారు. 

Read more