చెన్నైని వీడిన ధోనీ
ABN , First Publish Date - 2020-03-16T10:27:07+05:30 IST
ఐపీఎల్ తాజా సీజన్ వచ్చే నెల 15 వరకు వాయిదా పడడంతో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ స్వస్థలం రాంచీకి బయలుదేరాడు. ఈ సందర్భంగా అతడికి ...
చెన్నై: ఐపీఎల్ తాజా సీజన్ వచ్చే నెల 15 వరకు వాయిదా పడడంతో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ స్వస్థలం రాంచీకి బయలుదేరాడు. ఈ సందర్భంగా అతడికి సీఎ్‌సకే యాజమాన్యం, అభిమానులు ఘనంగా వీడ్కోలు పలికారు. జాతీయ జట్టుకు చాన్నాళ్ల నుంచి దూరంగా ఉంటున్న ధోనీ ఈసారి ఐపీఎల్‌లో సత్తా చూపాలనుకున్నాడు. అందుకే చాలా ముందుగానే సన్నాహకాలను ఆరంభించాడు. కానీ కొవిడ్-19 వైరస్ కారణంగా లీగ్‌ను వాయిదా వేయడంతో జట్టు ప్రాక్టీస్ సెషన్‌ను కూడా ఆపేశారు. ‘విజిల్ వేస్తూనే ఉండండి. ‘తలా’ ధోనీకి చిన్న విరామం’ అంటూ సీఎ్‌సకే ట్వీట్‌తో పాటు ఓ వీడియోను పోస్ట్ చేసింది. దీనిలో ధోనీ అభిమానులకు ఆటోగ్రా్‌ఫలిస్తూ వారితో మాట్లాడుతూ కనిపించాడు.