అంతర్జాతీయ క్రికెట్‌కు పాక్ పేసర్ మహ్మద్ ఆమిర్ గుడ్‌బై

ABN , First Publish Date - 2020-12-17T23:59:07+05:30 IST

పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆమిర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. రిటైర్మెంట్ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు తెలియజేసిన

అంతర్జాతీయ క్రికెట్‌కు పాక్ పేసర్ మహ్మద్ ఆమిర్ గుడ్‌బై

కరాచీ: పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆమిర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. రిటైర్మెంట్ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు తెలియజేసిన ఆమిర్.. అందుకు గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. తాను ఇకపై అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనుకోవడం లేదని, కాబట్టి ఇకపై జరగనున్న అంతర్జాతీయ మ్యాచ్‌లకు తన పేరును పరిగణనలోకి తీసుకోవద్దని పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వాసిం ఖాన్‌కు  ఆమిర్ తెలియజేసినట్టు బోర్డు తెలియజేసింది.


తాజాగా ముగిసిన లంక ప్రీమియర్ లీగ్‌లో ఆమిర్ మంచి ప్రతిభ కనబరిచాడు. ఆమిర్ తన అంతర్జాతీయ కెరియర్‌లో ఇప్పటి వరకు 30 టెస్టులు, 61 వన్డేలు, 50 టీ20లు ఆడాడు. 259 అంతర్జాతీయ వికెట్లు తీసుకున్నాడు. ఆగస్టులో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో చివరిసారి ఆడాడు. 28 ఏళ్ల ఆమిర్ 17 ఏళ్ల వయసులో నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ తరపున ఆరంభ సీజన్‌లోనే 55 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో అతడిని వాసిం అక్రమ్‌తో పోల్చడం మొదలుపెట్టారు. 2009లో టీ20 ప్రపంచకప్ సందర్భంగా పాక్ జాతీయ జట్టులో అడుగుపెట్టాడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో కీలక వికెట్ తీయడం ద్వారా పాక్ విజయానికి బాటలు వేశాడు.


Updated Date - 2020-12-17T23:59:07+05:30 IST