జట్టులోకి మళ్లీ వచ్చేస్తున్న ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్
ABN , First Publish Date - 2020-12-14T02:17:56+05:30 IST
వ్యక్తిగత కారణాలతో సెలవులో వెళ్లిన ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్.. భారత్‌తో జరగనున్న పింక్‌బాల్ టెస్టులో ఆడేందుకు సంసిద్ధత వ్యక్తం

సిడ్నీ: వ్యక్తిగత కారణాలతో సెలవులో వెళ్లిన ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్.. భారత్‌తో జరగనున్న పింక్‌బాల్ టెస్టులో ఆడేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాడు. జట్టులో తిరిగి చేరేందుకు ఆదివారం తన సమ్మతిని తెలియజేశాడు. పింక్‌బాల్ టెస్టు క్రికెట్‌లో 42 వికెట్లు పడగొట్టిన స్టార్క్ వ్యక్తిగత కారణాలతో భారత్‌తో జరిగిన చివరి రెండు టీ20లకు దూరమయ్యాడు. సోమవారం అడిలైడ్‌లో జట్టుతో కలవనున్నాడు. అనంతరం టెస్టుకు సిద్ధం కావడానికి రెండు పూర్తి రోజుల సమయం ఇవ్వనున్నారు. సోమవారం అతడిని సాదరంగా ఆహ్వానించనున్నట్టు కోచ్ జస్టిన్ లాంగర్ పేర్కొన్నాడు. స్టార్క్ తిరిగి జట్టులోకి రానుండడం తమకు గొప్ప వార్తేనని హాజెల్‌వుడ్ ఆనందం వ్యక్తం చేశాడు. పింక్‌బాల్ గేమ్‌లో అతడి సామర్థ్యం ఏంటనేది అందరికీ తెలుసన్నాడు.