చీఫ్ సెలెక్టర్ పదవికి మిస్బా గుడ్‌బై..!

ABN , First Publish Date - 2020-10-14T23:12:39+05:30 IST

పాకిస్తాన్ క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి వైదొలుగుతున్నట్టు పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం

చీఫ్ సెలెక్టర్ పదవికి మిస్బా గుడ్‌బై..!

కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి వైదొలుగుతున్నట్టు పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం మిస్బా ఉల్ హక్ ప్రకటించాడు.  జాతీయ జట్టు ప్రధాన కోచ్ పాత్రను సమర్థంగా నిర్వహించేందుకే  ఈ నిర్ణయం తీసుకున్నట్టు మిస్బా పేర్కొన్నాడు. ఈ నెల 30 నుంచి తాను చీఫ్ సెలక్టర్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి తెలిపానని అతడు వెల్లడించాడు. గతేడాది సెప్టెంబర్‌లో పాకిస్తాన్ జట్టు ప్రధాన కోచ్‌ బాధ్యతలతో పాటు చీఫ్ సెలక్టర్‌ పదవిని కూడా మిస్బా చేపట్టాడు. ‘‘జింబాబ్వే జట్టుపై జరిగే సిరిస్ వరకే నేను జట్టును ఎంపిక చేస్తాను. ఆ తర్వాత ఇక పూర్తిగా ప్రధాన కోచ్ బాధ్యతల పైనే దృష్టిపెడతాను..’’ అని మిస్బా పేర్కొన్నాడు. కాగా తాను చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి తప్పుకోవడం తన సొంత నిర్ణయమేనని.. దీని వెనుక ఎలాంటి ఒత్తిడీ లేదని స్పష్టం చేశాడు. 

Updated Date - 2020-10-14T23:12:39+05:30 IST