‘ఫిట్‌ ఇండియా’లో 10 కోట్లమంది

ABN , First Publish Date - 2020-10-03T09:05:19+05:30 IST

‘ఫిట్‌ ఇండియా ఉద్యమం’లో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 10 కోట్లమందికిపైగా భాగస్వాములయ్యారని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు...

‘ఫిట్‌ ఇండియా’లో 10 కోట్లమంది

న్యూఢిల్లీ: ‘ఫిట్‌ ఇండియా ఉద్యమం’లో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 10 కోట్లమందికిపైగా భాగస్వాములయ్యారని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజు వెల్లడించారు. ఫిట్‌నె్‌సపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రధాని మోదీ గత ఏడాది ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ‘ప్రజల్లో ఫిట్‌నె్‌సతోపాటు మానసిక సామర్థ్యం పెంచడమే ఈ ప్రచారోద్యమ లక్ష్యం. దీనిపై ఇటీవల నేను సమీక్ష జరిపా. ఇందులో ఇప్పటిదాకా 10 కోట్లమందికిపైగా ప్రజలు పాల్గొన్నారని తెలిపేందుకు సంతోషిస్తున్నా’ అని శుక్రవారం రాజ్‌ఘాట్‌ వద్ద సీఆర్‌పీఎఫ్‌ ర్యాలీలో మాట్లాడుతూ మంత్రి అన్నారు. 

Updated Date - 2020-10-03T09:05:19+05:30 IST