టైసన్ ప్రత్యర్థి బ్రిగ్స్
ABN , First Publish Date - 2020-05-19T09:08:53+05:30 IST
మళ్లీ తాను రింగ్‌లోకి అడుగుపెడుతున్నానంటూ ఇటీవల ప్రకటించిన బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్‌తో తలపడబోయేది ఎవరో తేలిపోయింది. అమెరికాకు చెందిన ...

లాస్‌ఏంజెల్స్: మళ్లీ తాను రింగ్‌లోకి అడుగుపెడుతున్నానంటూ ఇటీవల ప్రకటించిన బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్‌తో తలపడబోయేది ఎవరో తేలిపోయింది. అమెరికాకు చెందిన ప్రొఫెషనల్ బాక్సర్ షనోన్ బ్రిగ్స్‌తో టైసన్ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్నాడు. ఈ విషయాన్ని బ్రిగ్స్ స్వయంగా వెల్లడించాడు. ‘టైసన్, నేను బాక్సింగ్ రింగ్‌లో ఫైట్ చేయబోతున్నాం. చారిటీ బౌట్ కోసం ఇద్దరం సంతకాలు చేశాం’ అని ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో 48 ఏళ్ల బ్రిగ్స్ వెల్లడించాడు. అయితే, మ్యాచ్ ఎప్పుడన్నది ప్రకటించలేదు. 2016 నుంచి బాక్సింగ్ రింగ్‌కు దూరంగా ఉన్న బ్రిగ్స్.. కెరీర్‌లో 68 బౌట్లతో తలపడితే 60 సార్లు గెలుపొందాడు. ఇందులో 53 నాకౌట్ విజయాలున్నాయి. రెండుసార్లు వరల్డ్ హెవీ వెయిట్ చాంపియన్‌షిప్ దక్కించుకున్న బ్రిగ్స్.. ఒకసారి డబ్ల్యూబీఓ టైటిల్ గెలిచాడు.