మిక్ షుమాకర్ ఎఫ్1 ఎంట్రీకి ఓకే
ABN , First Publish Date - 2020-12-03T09:47:00+05:30 IST
ఫార్ములావన్ దిగ్గజం మైకేల్ షుమాకర్ తనయుడు మిక్ షుమాకర్ ఎఫ్1 అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. 21 ఏళ్ల మిక్.. వచ్చే సీజన్లో హాస్ (అమెరికా) జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు.

సాఖిర్ (బహ్రెయిన్): ఫార్ములావన్ దిగ్గజం మైకేల్ షుమాకర్ తనయుడు మిక్ షుమాకర్ ఎఫ్1 అరంగేట్రానికి రంగం సిద్ధమైంది. 21 ఏళ్ల మిక్.. వచ్చే సీజన్లో హాస్ (అమెరికా) జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ మేరకు ఆ జట్టుతో మిక్ బుధవారం ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పటికే ఎఫ్2లో సత్తాచాటిన మిక్.. ఎఫ్1లో ఎలా రాణిస్తాడో చూడాలి.